ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి
Published: Sunday December 30, 2018

విజయవాడ: భవానీ దీక్షాపరులతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. అలాగే భవానీ దీక్షల విరమణ రెండో రోజుకు చేరింది. వేలాది మంది భవానీ దీక్షాపరులు దీక్షల విరమణకు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అలాగే మరోవైపు ఆదివారం కూడా కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దీంతో దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా నిన్న దుర్గమ్మను సుమారు 90వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
