అమెరికాలో మంత్రి నారా లోకేష్ రోడ్ షో

లాస్‌ఏంజిల్స్ : ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. లాస్‌ఏంజిల్స్ చేరుకున్న మంత్రి ఇన్వెస్ట్‌మెంట్ రోడ్ షో నిర్వహించారు. ఇందులో భాగంగా లాస్‌ఏంజిల్స్ ఎలక్టో హెల్త్‌కేర్ సీఈవో లక్ష్మణ్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, హెల్త్ సర్వీసెస్‌లో ఉన్న ఎలక్టో హెల్త్ కేర్‌మెడ్ టెక్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మెడికల్ పరికరాల తయారీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాలసీలు తీసుకొచామని చెప్పారు. ఏపీలో హెల్త్‌కేర్ రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయని, కంపెనీ ఏర్పాటుకు సహకారం అందిస్తామని ఏపీ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇండియాలో కంపెనీని విస్తరించాలని అనుకుంటున్నామని... మీ పాలసీలు, రాయితీల గురించి తెలుసుకున్నామని త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికతో మీ ముందుకు వస్తామని మంత్రి లోకేష్‌తో లాస్‌ఏంజిల్స్ ఎలక్టో హెల్త్‌కేర్ సీఈవో లక్ష్మణ్‌రెడ్డి అన్నారు.
