ఒక నంబరు.. రెండు నెట్‌వర్క్‌లు

Published: Monday December 24, 2018

పోర్టుబులిటీ వచ్చిన తర్వాత చాలా మంది పాత నంబరు మార్చకుండానే వేరే నెట్‌వర్కుకు వెళ్లడం సులభమైంది. దీనికి ట్రాయ్‌ అనుసంధానకర్తగా ఉండి ఒక కోడ్‌ జారీ చేస్తుంది. దరఖాస్తుదారు తమకు నచ్చిన నెట్‌వర్కు స్టోర్‌కు వెళ్లి ఆ కోడ్‌ చూపిస్తే.. వాళ్లు మిగతా పని పూర్తి చేస్తారు. ఎప్పుడైతే పాత సిమ్‌ పనిచేయడం ఆగిపోతుందో అప్పుడు కొత్త నెట్‌వర్క్‌ సిమ్‌ వేసి యాక్టివేషన్‌ చేస్తే అదే నంబరుపై మాట్లాడుకోవచ్చు. ఇలాంటి విధానంలోనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వ్యాపారి ఒకరు 94403 29002 అనే బీఎ్‌సఎన్‌ఎల్‌ నంబరును, జియోకు మారేందుకు పోర్ట్‌ పెట్టుకున్నారు. వారు ఇచ్చిన గడువు తర్వాత జియో సిమ్‌ వేశారు. విచిత్రం ఏమిటంటే ఇదే నంబరుపై ఇప్పుడు బీఎ్‌సఎన్‌ఎల్‌, జియో నెట్‌వర్కు లు రెండూ పనిచేస్తున్నాయి. ఆ రెండు టెలికం కంపెనీల ప్రతినిధులను ఈ అంశంపై ప్రశ్నిస్తే.. అలా జరిగే అవకాశం లేదని చాలా గట్టిగా చెబుతున్నారు. కానీ, ఆ వ్యాపారి మాత్రం ఎందుక్కాదు..! ఇదిగో అని.. ఆ నంబరుతో రెండు నెట్‌వర్కుల మధ్య కాన్ఫరెన్స్‌ కాల్‌ పెట్టి మాట్లాడారు. బీఎ్‌సఎన్‌ఎల్‌కు రూ.10లతో రీచార్జ్‌ చేస్తే అయ్యింది. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.