అపరిచిత ఫోన్‌కాల్స్‌తో లూటీ చేస్తున్న ఆగంతకులు
Published: Saturday December 22, 2018

కొన్ని అపరిచిత ఫోన్ కాల్స్ బ్యాంక్ ఖాతాదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. అపరిచిత ఫోన్‌కాల్స్‌ను నమ్మి బ్యాంక్ అకౌంట్లు, ఏటీఎం నంబర్లు, ఆధార్‌కార్డుల నంబర్లు చెప్పి నిలువు దోపిడీకి గురైనవారు గ్రామాలలో వందల మంది ఉన్నా రు. రెండు నెలల క్రితం శెట్పల్లికి చెందిన ఒక గిరిజన రైతుకు ఫోన్ చేసి వివరాలు సేకరించి రూ.30 వేలు కాజే శారు. ఇలా మండలంలో అనేక మంది అమాయకులు ఉన్నారు. అటోమెటిక్ టెల్లర్ మిషన్ (ఏటీఎం)కార్డుల ద్వారా నైజీరియన్లు చేస్తున్న ఆన్‌లైన్ మోసాలను తలదన్నే విధంగా ఒడిశా, బీహార్ ప్రాంతాలనుంచి వస్తున్న అపరిచిత ఫోన్‌కాల్స్ బ్యాంక్ ఖాతాదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వస్తున్న అపరిచి త కాల్స్ పట్ల సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
ఫోన్ చేసిన అవతలి వ్యక్తి మీకు ఏ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది ఉంటే ఏటీఎం కార్డు ఉందా, మీ ఏటీఎం కార్డు ఈనెలా ఖరులోగా రినివల్ చేసుకోకపోతే మీ లావాదేవీలు ఆగిపోతాయి అంటూ గౌరవ ప్రదంగానే మట్లాడుతూ ఏటీఎం పైన ఉన్న 16అంకెల నంబరును, పిన్ నంబరును తెలియజేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది అమాయక జనం దీన్ని నమ్మి తమ వివరాలను వెల్లడించి అకౌంట్లో ఉన్న డబ్బులను దొంగల పాలు చేసి లబోదిబో మంటున్నారు. ఇలా చేయడం వల్ల దొంగచేయికి తాళం చెవి ఇచ్చినట్లే అయితే ఈ మూఠా క్లోనింగ్ ద్వారా ఏటీఎంలను డీకోడ్ చేసి బ్యాంక్‌లో ఉన్న నగదును స్వాహా చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా వస్తున్న ఈకా ల్స్ పట్ల చదువుకొన్న కొందరు బ్యాంక్ అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ విషయమై బ్యాంక్ అధికారులు ఏటీఎం నంబరుకాని, పిన్ నంబర్ కాని అంత్యంత గోప్యంగా ఉంచాలని ఎవరికి వెళ్లడించకూడ దని పేర్కొంటున్నారు. తె లిసో తెలియకో పిన్ నంబర్ లు వెల్లడించిన పక్షంలో వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లి, పిన్ నంబర్ మార్పు చేసుకుంటే మోసపోకుండా ఉండగలరు. ఏటీఎంపైన కార్డు గడువు తేదీ పేర్కొన బడి ఉంటుంది కాబట్టి సంక్షిప్త సందేశం ద్వారా అపరిచిత ఫోన్‌కాల్స్ ద్వారా ఏటీఎం కార్డుల వివరాలు అడిగితే అపరిచితులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా బ్యాంక్ అధికారులను సంప్రదించి తమ సందేహాలునివృత్తి చేసుకోవాలని బ్యాంక్ అధికారులు కోరుతున్నారు. ఈ విషయమై పోలీసులు, బ్యాంక్ అధి కారులు ఖాతాదారులను చైతన్య పరిచే దిశగా చర్యలు తీ సుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
