రెండేళ్లలోనే అమెరికా గ్రీన్ కార్డు
Published: Thursday December 20, 2018

గుంటూరు: అమెరికాలో ఇన్వెస్టర్స్ వీసాతో రెండెళ్లలోనే గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉంద ని క్రాస్‌బోర్డర్స్ డైరెక్టర్, సీఈఓ భాస్కర్ దూలం తెలిపారు. బుధవారం గుంటూరులోని ఓ హో టల్‌లో ఆయన విలేకరు లతో మాట్లాడారు. అమె రికాలో ఇప్పటివరకు హెచ్1బి, ఎఫ్1, ఎల్1 వీసాలపై గ్రీన్ కార్డు దరఖాస్తు చేసుకుంటే కనీసం 10 నుంచి 12 సంత్సరాలు పడు తోందన్నారు. అదే ఈబీ5 ఇన్వెష్టర్స్ వీసాతో రూ. 5లక్షల యూఎస్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి పది మంది యూఎస్ పౌరులకు ఉపాధి చూపిస్తే రెండేళ్ల వ్యవధిలో గ్రిన్ కార్డు పొందవచ్చునని చెప్పారు.
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ అమెరికాలో ఇటీవల రూపొందించిన నియమ నిబంధనలు ప్రకారం వీసా, గ్రీన్ కార్డు పొందడం క్లిష్టతరమైందన్నారు. ఇన్వెస్టర్స్ వీసా ఇందుకు చక్కని ప్రత్యామ్నాయమన్నారు. ఈబీ5 విధానం ద్వారా కేవలం రెండు సంవత్సరాల్లోనే గ్రీన్ కార్డు పొందవచ్చునన్నారు. దీనికి గాను భారతదేశంలో ఇన్వస్టర్స్ రీజనల్ సెంటర్‌లు ఉన్నాయని, వీటి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9666123401 సంప్రదించాలని మన్నవ మోహన కృష్ణ సూచించారు.
