‘పెథాయ్’ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

Published: Friday December 14, 2018

అమరావతి: ‘పెథాయ్’ తుఫాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు సన్నద్ధతపై ఈరోజు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను ప్రభావ పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేట తుపాన్ సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్‌లో ఉండాల‌ని ఆదేశించారు. ఆయా శాఖ‌ల అధికారులు ఆర్టీజీఎస్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీంతో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఆర్టీజీఎస్‌ అప్రమత్తం చేసింది