మంత్రగాడి మాటలు కలెక్టర్ నమ్మడమా’!
Published: Thursday December 13, 2018

విశాఖపట్నం: విజయనగరం జిల్లా కలెక్టర్ హోదాలో ఉన్న హరి జవహర్‌లాల్ తన బాధ్యతను మరిచి మంత్రగాడి మాటలు విశ్వసించడం విడ్డూరంగా ఉందని దళిత సేన నాయకులు మండిపడ్డారు. స్థానిక తాడివీధిలో ఉన్న కమ్యూనిటీ హాలులో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దళిత సేన నాయకుడు పాల్తేటి పెంటారావు మాట్లాడుతూ గుంటూరుకు చెందిన సీహెచ్.వెంకటేశ్వర్లు అనే మంత్రగాడు తన మంత్రాలతో వర్షం కురిపిస్తానని కలెక్టర్ హరి జవహర్‌కు చెబితే నమ్మేయడం చాలా దారుణమన్నారు. పైగా తన మూఢ విశ్వాసాన్ని తన కింద పనిచేస్తున్న యంత్రాంగం మీద రుద్దుతూ అగ్రికల్చరల్ డైరెక్టర్‌కు రాత పూర్వకమైన ఆదేశాలు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. నక్కెళ్ల నాగమణి మాట్లాడుతూ ఈ విషయమై ముఖ్యమంత్రి తక్షణమే ఆ కలెక్టర్‌ను విధుల నుంచి తొలగించాలన్నారు.
