‘క్రాస్ బో-18’ విజయవంతమైందని ప్రకటన
Published: Sunday December 09, 2018

రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో వైమానిక దళ అధికారులు క్షిపణి ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. ‘క్రాస్‌బో-2018’ పేరుతో రెండు రోజులపాటు చేపట్టిన ఈ విన్యాసాలు సక్సెస్ అయినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. నాలుగు రకాల క్షిపణులు ఆకాశ్, స్పైడర్, ఓఎ్‌సఏ-ఏకే-ఎం, ఐజీఎల్‌ఏలను ప్రయోగించారు. భూ ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఇవి ఛేదిస్తాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేంద్ర సింగ్ ధనోవా ముఖ్యఅతిథిగా హాజరయ్యరు. దక్షిణ ఎయిర్ కమాండ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ కెప్టెన్ ఆర్‌ఎం కుమారస్వామి వీటికి సారథ్యం వహించారు. నేవీ ఇలాంటి విన్యాసాలు చేయడం ఇదే మొదటిసారని ధనోవా పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సన్నద్ధంగా ఉన్నామని చెప్పడానికే ఈ ప్రయోగాలని ఆయన చెప్పారు.
