చెప్పులు కుట్టేవారి పింఛన్ రూ.2 వేలకు పెంపు
Published: Saturday December 08, 2018

చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న దళితులకు రూ.1000 నుంచి రూ.2 వేలకు పింఛన్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్ తెలిపారు. ఈనెల 18వ తేదీలోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీలై ఉండి స్థానికత, జన్మదిన ధృవీకరణ పత్రాలు, సం ప్రదాయకంగా చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న 40ఏళ్ల వ యస్సు పైబడినవారు, రేషన్, ఆధార్‌కార్డులతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు పెన్నార్‌భవన్‌లోని తమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
